తమన్ దూకుడు మామూలుగా లేదుగా?

Taman racing

సంగీత దర్శకుడుగా సంచలనమైన ఎంట్రీ ఇచ్చాడు తమన్. తొలి సినిమాకే ఆడియన్స్ కు ‘కిక్’ ఇచ్చాడు. రవితేజ పరిచయం చేసిన తమన్ ఆ తర్వాత అత్యంత వేగంగా యాభై సినిమాలు పూర్తి చేసుకుని ఎంటైర్ సినిమా వారికే షాక్ ఇచ్చాడు. చిన్నా పెద్దా అనే తేడా లేదు. వచ్చిన ప్రతి సినిమాకూ సంగీతం అందించాడు. ఈ క్రమంలోనే స్మాల్ హీరోలే కాక స్టార్ హీరోలకు సైతం బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. మధ్యలో తమన్ ట్యూన్స్ పై కొన్ని విమర్శలు వచ్చినా.. అతను మాత్రం వేగం తగ్గించుకోలేదు. అవేవీ పట్టించుకోలేదు.ఇక రీసెంట్ గా అల వైకుంఠపురములోతో మరోసారి ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ తమనే కావాలి అంటూ పట్టు బడుతున్నారు. ప్రస్తుతం తమన్ సంగీతం అందిస్తోన్న సినిమాల లిస్ట్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తమన్ కంటే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయా లేవా అనే వైపు ఎవరూ ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే అతనే బెస్ట్ గా కనిపిస్తున్నాడు అందరికీ. అందుకే ప్రతి ఒక్కరూ తమనే కావాలి అంటున్నట్టు కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు ఫస్ట్ సాంగ్ మగువా మగువా తో ఆకట్టుకున్నాడు. నాని హీరోగా నటించిన వి సినిమాలోని పాటలు సైతం మెప్పిస్తున్నాయి. మెలోడీ, మాస్ ను ఆకట్టుకునేలా ఈ కంపోజింగ్ ఉండబోతోందని ఇప్పటికే అర్థమైంది. అలాగే నాని నెక్ట్స్ మూవీ టక్ జగదీష్ కు కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా అటు వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాకూ తమనే మ్యూజిక్ డైరెక్టర్.

ఇక చాలా చిన్న పనులతో విడుదలకు సిద్ధంగా ఉన్న సోలోబ్రతుకే సో బెటర్ లోని పాటలు కూడా ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అదే టైమ్ లో తను బాగా ఇష్టపడే రవితేజ క్రాక్ సైతం తమన్ దే. ఈ సినిమా టీజర్ ను బట్టి మూవీలో రీ రికార్డింగ్ కూడా అదిరిపోతుంది అనేలా కనిపిస్తోంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే.. రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాటతో పాటు.. మరోసారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న సినిమాలకూ తమనే సంగీతం ఇస్తున్నాడు. ఈరెండు  సినిమాలకు ఆల్రెడీ ట్యూన్స్ చేస్తున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి.. మొత్తంగా తమన్ ఇప్పుడు ఏకంగా పది పన్నెండు సినిమాలతో ఓ రేంజ్ లో బిజీగా ఉన్నాడు. ఊపు చూస్తోంటే అతనిప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇక తమన్ ముందు ఎవరైనా నిలబడాలంటే ముందు వారు కూడా అల వైకుంఠపురములో లాంటి చార్ట్ బస్టర్స్ ఇస్తే కానీ.. తమన్ దూకుడు తగ్గదేమో. ఏదేమైనా ఇన్నేసి సినిమాలకు సంగీతం అందిస్తోన్న తమన్.. కొన్ని సినిమాల్లో పాటలు తేడా ఉంటాయోమే కానీ.. నేపథ్య సంగీతం మాత్రం అద్దరగొడతాడనే చెప్పాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *