రెమ్యూనరేషన్ తో షాక్ ఇచ్చిన తమన్నా

Tamanna host AHA interviews

మిల్కీ బ్యూటీగా టాలీవుడ్ లో తనకంటూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న  హీరోయిన్ తమన్నా. ఆరంభంలో తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ తమిళ్ కు వెళ్లి పాపులర్ అయింది. ఆ పాపులారిటీతోనే తిరిగి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తమన్నాకు ఇక్కడ బిగ్గెస్ట్ హిట్స్ లేకపోయినా.. ఎప్పుడూ బిజీగానే ఉండటం విశేషం. తర్వాత మెల్లగా హిట్ ట్రాక్ లోనూ పడిపోయింది. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసింది. ఓ దశలో ఐటమ్ సాంగ్స్ కు సైతం సై అంటూ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం మూణ్నాలుగు సినిమాలతో బిజీగానే ఉన్నా.. అమ్మడి కెరీర్ క్లైమాక్స్ లోనే ఉందని చెప్పాలి. అందుకే రూట్ మార్చింది. తను త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో హోస్ట్ గా రాబోతోంది. యస్.. తమన్నా ఆహా లో ఇంటర్వ్యూస్ చేయబోతోంది. తెలుగులో మొదటి డిజిటల్ ప్లాట్ ఫామ్ గా వచ్చిన ఆహా ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నంతగా సక్సస్ కావడం లేదు అనేది నిజం. ఆహాను ఆడియన్స్ కూడా ఓహో అనేలా చేసేందుకు అన్ని ఎత్తులూ వేస్తున్నారు ఓనర్స్. ఇందులో భాగంగానే తమన్నాతో కొన్ని ఇంటర్వ్యూస్ చేయించబోతున్నారు.

అయితే తమన్నా కండీషన్స్ చూసి మొదట్లో షాక్ అయ్యారట. ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా పదిలక్షల వరకూ డిమాండ్ చేసిందట. ఇక ట్రావెల్ తో పాటు స్టేయింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి కదా. మొత్తంగా చూస్తే ఓ పదిహేను లక్షల వరకూ అవుతోందట. దీంతో కాస్త బేరాలు చేసి గెస్ట్ ను, ఇతర విషయాలను బట్టి 8 వరకూ ఇస్తాం అని చెప్పారట. అఫ్ కోర్స్ కొన్ని ఇంటర్వ్యూస్ కు పది కుడా ముట్టచెబుతారు. ఇక ఈ ఇంటర్వ్యూస్ లో భాగంగా అమ్మడితో ఒక వారం రోజుల డేట్స్ తీసుకుంటారు. ఈ వారంలో మరో వారినిక సరిపడా ఇంటర్వ్యూస్ చేయిస్తారు. అంటే ఓ 6-8 ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. అంటే ఇంటర్వ్యూకు ఎనిమిది లక్షలే అనుకున్నా.. వారినిక ఏకంగా 50 లక్షల వరకూ సంపాదిస్తుందన్నమాట. ఏదేమైనా ఏజ్ బార్ అయిన హీరోయిన్లంతా ఇన్ కమ్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలే తీసుకుంటున్నారు. వారితో పోలిస్తే తమన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తలే తీసుకున్నట్టుంది.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *