‘800’ టైటిల్‌తో…

Tamil star vijay setupati as muttaiah muralidharan

విజయ్ సేతుపతి అంటేనే విభిన్న పాత్రలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. అందుకే ఆయనకు తమిళ్, తెలుగు సినిమాలు క్యూ కడుతున్నాయి. తాజాగా విజయ్ మరో విభిన్న పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ శ్రీలంకన్‌ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధర న్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ను విజయ్‌ సేతుపతి పోషించనున్నారు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్, థార్‌ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించనున్నాయి.

క్రికెటర్ గా క్యారెక్టర్ చేయడం చాలెజింగ్ లాంటిదని, ఈ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని వెయిట్ చేస్తున్నానని అన్నారు. ఈ చిత్రం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది ఖరారు కాలేదు. త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి ఎలా కనిపిస్తాడోనని, ముత్తయ్య బాడీ లాంగ్వేజ్ అనుసరించడానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *