మద్దతిస్తారా.. పార్టీ పెడతారా..?

Tamil Supar star Rajani do start new political party?

చెన్నై అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ నడుస్తోంది. గతంలో మీడియా సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని, తాను సీఎం పదవికి దూరంగా ఉండి పార్టీని నడిపిస్తానని రజనీకాంత్ ప్రకటించారు. అయితే రజనీ పార్టీని ప్రారంభించక ముందే ఆయనతో పొత్తు కుదుర్చుకునేందుకు ముఖ్య పార్టీలు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్‌, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీలు రహస్య మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు మిత్రపక్షాలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలను మాత్రమే కేటాయించాలని భావిస్తుండటంతో ఇతర మిత్ర పక్షాలు బీజేపీ, పీఎంకే, డీఎండీకే పార్టీలు రజనీ వైపు చూస్తున్నాయి.

గతంలో కమల్‌హాసన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో రజనీ మాట్లాడుతూ భవిష్యత్‌ రాజకీయ అవసరాల కోసం ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కమల్‌ పార్టీతో చేతులు కలుపుతానని ప్రకటించారు. రజనీ స్వతంత్రంగా బరిలో దిగుతారా? లేక కమల్ తో పనిచేస్తారా? ఇతర మిత్ర పక్షాలకు మద్దతు ఇస్తారని చర్చంచనీయాంశంగా మారింది. కొన్ని నెలలు గడిస్తేనే కానీ రజనీకాంత్ పార్టీ గురంచి స్పష్టత రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *