పాక్ లో కిలో టామాటా రూ.300

TAMOTA RATE IN PAK INCREASE

భారత్ పై ప్రతీకార చర్య చేపడదామని భావించి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పాకిస్థాన్ కు వాటి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తోంది. తాను తీసుకున్న నిర్ణయాల ఫలితం ఎంతటి ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. భారత్ లో తన రాయబారిని వెనక్కి పిలిపించడంతోపాటు తమ దేశంలో భారత రాయబారిని తిప్పి పంపేసింది. అంతేకాకుండా భారత్ తో వ్యాపార లావాదేవీలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భారత్ కు ఎలాంటి నష్టం ఉండదని, పాక్ కే ప్రతికూలత ఎదురవుతుందని చాలామంది హెచ్చరించారు. అయినా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వినిపించుకోలేదు.

తాజాగా ఆ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వారం తిరగకుండానే ఆయనకు తెలిసొచ్చింది. పాక్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కిలో టమాటా ధర రూ.300కి చేరింది. గత వారం రూ.10 ఉన్న కిలో బంగాళాదుంపలు ప్రస్తుం రూ.40కి చేరాయి. మన దేశం నుంచి పాక్ కు టమాటాలు, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, సోయాబీన్స్, చెప్పులు, పంచదార, ప్లాస్టిక్ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం భారత్ తో వర్తక వాణిజ్యాలు నిలిపివేస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకోవడంతో వీటి సరఫరా ఆగిపోయింది. దీంతో అక్కడ రేట్లు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితులు ఉత్పన్నం కావడం ఖాయమని అంటున్నారు. వీటిని దాయాది దేశం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *