TDF కెనడా నేతృత్వంలో బతుకమ్మ సంబురాలు

Spread the love

TDF CANADA BATHUKAMMA CELEBRATIONS

ఇండియాబయట కూడా తెలంగాణా పల్లె ఉన్నదా అని అందరూ ఆశ్చర్య పడేటట్లు చేసినారు కెనడా లో  ఉన్న మన తెలంగాణా కుటుంబాల వాళ్ళు . తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం (టీడీఫ్ కెనడా) వారి సాంస్కృతిక విభాగం అయినటువంటి ‘తంగేడు’ (tangedu) ఆధ్వర్యం లో  కెనడా లోని  టొరంటో (బ్రామ్థన్) నగరం లోని డేవిడ్ సుజుకి  స్కూల్ లో నిర్వహించిన  బతుకమ్మ పండుగ అచ్చం  తెలంగాణా పల్లె ను గుర్తు చేసింది. కెనడాలో స్థిరపడిన తెలంగాణవాదులు తమ కుటుంబాలతో సహా సుమారు 600 మంది హాజరు అయిన ఈ సంబరాలలో ఆట, మాట, పాట అన్నిట్లా పూర్తి తెలంగాణా సాంప్రదాయ రీతిల జరుపుకొని విదేశాల్ల ఉన్న తెలంగాణా వాళ్ళు తమ సంస్కృతి ని నిలబెట్టుకోవడం ల ఎంతగా పాటు పడుతున్నారు అనే విషయానికి ఒక నిదర్శనంగ ఉన్నది. ఆహ్లాదకరం ఆయన వాతావరణంలో అనేక మంది తెలంగాణా మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి పాటలు పాడుకుంటూ సంతోషంగా జరుపుకున్నరు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ రకాల పోటీలను కూడా పెట్టినారు. పెద్ద వాళ్ళు తెలంగాణా సంస్కృతిల బతుకమ్మ పండుగు యొక్క గొప్పదనాన్ని పిల్లలకు చెప్పినారు. తరువాత రక రకాల సాంప్రదాయ తెలంగాణా వంటకాల తో మంచి రుచికరమైన  భోజనాలు కూడా వడ్డించారు. చాలా బాగా కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులను అందరూ మెచ్చుకున్నరు. కార్య క్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ,బంగారు తెలంగాణా అభివృద్ధికి  కి పాటు పడుతూనే, తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్య క్రమాలను చేస్తూ ఉంటామని తెలుపుతూ  కార్య క్రమంలో పాల్గొని విజయ వంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపినారు.  ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడాకు చెందిన ఫౌండేషన్ కమిట చైర్మైన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీస్ చైర్మన్ గార్లపాటి జితేంధర్,  అధ్యక్షులు పిణీకేశి అమిత రెడ్డి, ఉపాధ్యక్షులు మూల కవిత  మరియు ఇతరులు.

టీడీఫ్ కెనడా  వారు 2005 నుండి ప్రతి సంవత్సరం ఏ విధంగా బతుకమ్మ పండుగ ను కెనడా లో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారో దిగువ పేర్కొన్న కోఆర్డినేటర్స్ చాలా శ్రమించి ఆ సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిపించి నారు. పద్మ గంట, శాంత  మేడ , ప్రమోద్ ధర్మపురి, శ్రీదేవి  ధర్మపురి,  అతిధి  పున్నం, వెంకటరమణ  రెడ్డి  మేడ, పిణీకేశి తిరుపతి రెడ్డి, కీసర మహేందర్ రెడ్డి, ముప్పిడి సుమన్ రెడ్డి,మూలం శ్రీనివాస్ రెడ్డి, కోండం రవీందర్ రెడ్డి, చాడ కృష్ణ రెడ్డి, అర్షద్ ఘోరీ, కోండం పవన్ కుమార్, చింతలపని శేషాంక్  మరియు ఇతర వాలంటీర్లు. ఈ కార్యక్రమం తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం (టీడీఫ్ కెనడా) వారి క్రీఢా విభాగం అయినటువంటి టీడీఫ్ కెనడా స్పోర్ట్స్ క్లబ్ (tdf Canada sports club) భాగస్వామ్యంతో నిర్వహించడం జరిగింది.

TELANGANA INTERNATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *