17 ఏళ్ళు పని చేసినా టీడీపీ గుర్తించలేదన్న కవిత 

Spread the love
TDP DIDN'T RECOGNIZED KAVITHA

కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన కవిత  ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మహానాడు లో తనకు అవమానం జరిగిందని,  కొందరు నేతలు చర్యలవల్ల టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నానని చెప్పి బీజేపీలో చేరిన కవిత ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి,  ప్రతిపక్షంలో ఉన్న టిడిపి  దొందూ దొందే అన్నారు.   వైసిపి పాలన,  గత టీడీపీ పాలన రెండు ఒకే విధంగా ఉన్నాయని ఆమె ఆరోపణలు గుప్పించారు. తాను 17 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తే, తనకు సరైన న్యాయం జరుగలేదని  బిజెపి నాయకురాలు, సినీ నటి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.  తాజాగా కవిత మండపేట పట్టణ వైశ్య నేత కాళ్లకూరి నాగబాబు ఇంటికి   వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో  మాట్లాడారు.  17 ఏళ్ల పాటు టిడిపి కోసం నిస్వార్ధంగా సేవ చేశానని, టీడీపీలో తనకు గుర్తింపు లభించలేదని  పేర్కొన్న ఆమె రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని  జోస్యం చెప్పారు. బీజేపీ ఒంటరిగానే పోటీచేసి తెలుగు రాష్ట్రాల్లో గెలుస్తుందన్న ధీమాను  వ్యక్తం చేశారు. ప్రస్తుత జగన్‌ పాలనకు, గత చంద్రబాబు పాలనకు పెద్దగా తేడా లేదని విమర్శలు గుప్పించారు.  అటు చంద్రబాబు పాలనలోనూ,  ఇటు జగన్ పాలనలోనూ  ప్రజావ్యతిరేక విధానాలు కనిపిస్తున్నాయని  ఆమె పేర్కొన్నారు.   ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో  బిజెపి బలోపేతం అవుతుందని  ఆమె తెలిపారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని  కవిత అభిప్రాయపడ్డారు. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుందని ఎంతో కాలంగా నలుగుతున్న జమ్మూ కాశ్మీర్‌ సమస్యను  పరిష్కరించిన ఘనత  నరేంద్ర మోడీకే ఉందని  ఆమె పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో పీడా ఎత్తున ప్రచారం నిరహిస్తామన్నారు కవిత .

AP BJP LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *