నేడు టీడీపీ తొలి జాబితా

TDP FISRT LIST TO BE RELEASED

  • 15 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
  • తిరుపతిలో జాబితా విడుదల చేయనున్న చంద్రబాబు

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చింది. 15 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్టు సమాచారం. శనివారం ఇందుకు సంబంధించిన తొలి జాబితాను సీఎం చంద్రబాబు తిరుపతిలో విడుదల చేయనున్నారు. వాస్తవానికి శుక్రవారమే జాబితా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో అది వాయిదా పడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి శిద్ధా రాఘవరావు ఒంగోలు నుంచి బరిలో దిగనున్నారు. తొలుత ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపలేదు. అయితే, అధినేత సూచనల మేరకు పోటీ చేయడానికి అంగీకరించారు. ఇక నెల్లూరు నుంచి బీద మస్తాన్‌రావు, రాజమహేంద్రవరం నుంచి మాగంటి రూప ఖరారయ్యారు. తిరుపతి నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేయనున్నారు. నంద్యాల లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులతో పాటు శివానందరెడ్డి పోటీపడుతున్నారు. శివానందరెడ్డికే  కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. అమలాపురం నుంచి మాజీ ఎంపీ హర్షకుమార్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మొత్తమ్మీద శనివారం 15 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నారు. మిగిలిన 10 స్థానాలకు రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉంది.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *