మహానాడుపై సందిగ్ధంలో టీడీపీ.. రీజన్ ఇదే

TDP IN CONFUSION STATE FOR MAHANADU

టీడీపీ వార్షికోత్సవం కార్యక్రమమైన మహానాడు ఎప్పుడూ అట్టహాసంగా నిర్వహిస్తారు. కానీ ఈ దఫా నిర్వహణపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 కలుపుకుని మొత్తం మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇప్పటివరకు టీడీపీ ఇదే రకంగా మహానాడును నిర్వహిస్తూ వస్తోంది.

సాధారణంగా మహానాడు ఏర్పాటుకు సంబంధించి ఒక నెల రోజుల ముందు నుంచే టీడీపీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది. స్టేజ్ నిర్వహణ మొదలుకుని భోజనాలు సహా అన్ని అంశాలపై ప్రత్యేకమైన కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ సారి మాత్రం మహానాడుకు సంబంధించి అలాంటి ఏర్పాట్లు చేయలేదు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు, ఆ తరువాత సమీక్షల కారణంగా చంద్రబాబు సైతం మహానాడుపై దృష్టి పెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి మహానాడును ఒక్క రోజు అమరావతిలో నిర్వహించాలా లేక ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి మరోసారి నిర్వహించాలా అనే అంశంపై టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.

అయితే ఈ సారి ఎన్నికల ఫలితాల వెలువడిన తరువాత మహానాడుకు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమ సమయం ఉండటంతో…ఈ కార్యక్రమాన్ని ఎప్పటిలాగే మూడు రోజులు నిర్వహించాలా లేక మే 28న ఒక్క రోజుకు మాత్రమే పరిమితం చేయాలా అనే అంశంపై టీడీపీ అధినాయకత్వం తర్జనభర్జన పడుతోంది. దీనిపై అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు… మహానాడు నిర్వహణపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *