టీడీపీ నుండి పోటీ చేస్తే అట్రాసిటీ కేసులు

TDP LEADERS BOOKED IN VJY

విజయవాడ పురపాలక ఎన్నికల్లో 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన కప్పగంతు శివరామశర్మను, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బెదిరించాడని, టీడీపీనుంచి కాకుండా తమపార్టీ తరపున పోటీ చేయాలని శర్మను ఒత్తిడి చేశాడని, అతనిపై పోలీసులతో బలవంతంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడని టీడీపీ నేత, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. తన మాట వినకుండా, టీడీపీనుంచి పోటీలో నిలిచాడన్న అక్కసుతో బ్రాహ్మణుడైన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన ఘనత మంత్రి వెల్లంపల్లికే దక్కిందన్నారు. వారి మాట వినకపోతే, వారి పార్టీలోకి రాకపోతే ఎవరినీ ఉపేక్షించరనే విషయం వైసీపీ మంత్రి చర్యతో, మరోసారి రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి చర్యలను, అహంకారాన్ని రాష్ట్ర బ్రాహ్మణులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.
కప్పగంతు శివశర్మ, కులమతాలకు అతీతంగా, అందరిచేతా మంచివాడిగా పిలిపించుకుంటున్నాడని, అటువంటి వ్యక్తిని కూడా తమ కక్షసాధింపులకోసం వాడుకోవడం వైసీపీ ప్రభుత్వంలోని మంత్రికే చెల్లిందన్నారు. టీడీపీ తరుపున నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తపై తప్పుడు కేసుపెట్టి, రిమాండ్ విధించి, అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారని, అతనితో పాటు మరో ఇద్దరిపై కూడా కేసులు మోపారన్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇప్పటికైనా తన మనసు మార్చుకొని, బ్రాహ్మణులపై పెట్టిన కేసులు ఉపసంహరింపచేయాలని వేమూరి డిమాండ్ చేశారు. తమ అధినేత మన్ననలు పొందడం కోసం, ఎదుటివారిని బలిపశువులను చేయాలనుకోవడం శ్రీనివాసరావుకి తగదన్నారు. ఇప్పటికే వారిపార్టీని, పార్టీ నాయకుడిని దేశవ్యాప్తంగా అందరూ ఏవగించుకుంటున్నారనే విషయం వెల్లంపల్లి తెలుసుకుంటే మంచిదన్నారు. 151 మంది శాసనసభ్యులు ఇతర కులాలపై, మతాలపై ఏవిధంగా దాడిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. వారు చేస్తున్న చేష్టలు, హత్యాయత్నాలవల్ల, టీడీపీ తరుపున నామినేషన్లు వేసేవారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిన భయపెట్టడం ద్వారా వైసీపీనేతలు, మంత్రులు ఎంతటి నీచస్థాయికి దిగజారారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తండ్రి పదవిని అడ్డంపెట్టుకొని, లక్షలకోట్లు సంపాదించి, ఏ1 ముద్దాయిగా ఉన్నవ్యక్తి, ఇతరులను తప్పుపట్టడం హస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాకంటక పాలనసాగిస్తున్నరాష్ట్ర పాలకులను ప్రజలు తరిమితరిమి కొట్టేరోజు దగ్గర్లోనే ఉందని ఆనంద్ సూర్య తీవ్రస్వరంతో హెచ్చరించారు. బ్రాహ్మణుడిపై అట్రాసిటీ కేసు పెట్టించిన వారికి, కచ్చితంగా బ్రాహ్మణుల శాపం తగిలి తీరుతుందన్నారు.

tags:  AP local body elections, Chandrababu Naidu, YS JaganMohanReddy, Vemuri Anand Surya, Vellampalli Srinivas, Vijayawada, Sivarama Sharma, SC, ST atrocity case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *