సీఎం జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే వంశీ

Spread the love

TDP MLA VAMSHi MEETS CM JAGAN

తెలుగుదేశం పార్టీ లో క్రియాశీలక నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయనను అసెంబ్లీలో కలిశారు. పోలవరం కుడి కాలువపై రైతుల మోటార్లకు విద్యుత్ ఇవ్వాలని జగన్ ను కోరారు. వంశీ అభ్యర్థనపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
ఇకపోతే ఈనెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగనమోహన్ రెడ్డికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖ రాశారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదని ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. పోలవరం ప్రధాన కుడి కాలువ పూర్తి కావడానికి సహకరించిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. మోటార్లతో పొలాలకు నీళ్లు పెట్టుకునే రైతులకు విద్యుత్ ఇవ్వాలని లేఖలో కోరారు.

రైతుకు నీరిచ్చేందుకు తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో రైతుల సహాయ నిరాకరణతో రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఆ విషయంలో తాను స్వయంగా జోక్యం చేసుకుని రైతులు పెట్టిన కేసులను దగ్గర ఉండి తీసి వేయించినట్లు గుర్తు చేశారు. కృష్ణా డెల్టాను కాపాడామని వల్లభనేని వంశీ లేఖలో పేర్కొన్నారు. తాజాగా సీఎం జగన్ ను కలిసి సమస్య పరిష్కరించాలని కోరారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.

LATEST POLITICAL NEWS

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *