అచ్చెన్నాయుడికే టీడీపీ పగ్గాలు

TDP New commitee elected

టీడీపీ అధ్యక్ష పదవి గత కొంతకాలంగా అచ్చెనాయుడిని ఊరిస్తూ వచ్చాయి. కొంత కాలం జైలులో ఉండాల్సి రావడంతో పార్టీ వర్గాల్లో ఆయనకు సానుభూతి పెరిగింది. దాంతో చంద్రబాబు నాయకుడు కూడా అచ్చెన్నాయుడి వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఈ మేరకు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. పార్టీలో కీలకమైన పదవులను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటిదాకా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళావెంకట్రావును పొలిట్‌బ్యూరోలోకి తీసుకొన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఈసారి పొలిట్‌బ్యూరోలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చోటు దక్కింది. ఇంతకు ముందు ఆయన అన్న హరికృష్ణ ఉండేవారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్‌.రమణను కొనసాగించారు.

పొలిట్ బ్యూరో ఇదే

యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్‌గజపతి రాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమ, ఫరూక్‌, గల్లా జయదేవ్‌, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల చంద్రశేఖరరెడ్డి, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *