విజయవాడలో  టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం 

Spread the love

TDP state wide conference in Vijayawada

ఏపీలో టిడిపి అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కోవడానికి కసరత్తు చేస్తోంది  . తమని తాము రక్షించుకునే క్రమంలో వైసిపి నేతల విమర్శలను తిప్పి కొట్టే పనిలో ఉంది.  అలాగే టిడిపి కార్యకర్తలపై విపరీతంగా దాడులు పెరుగుతున్నాయని, వారికి అండగా ఉండటంతో పాటుగా, పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే పనిలో ఉంది టీడీపి. ఇక తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం జరగనుంది.

విజయవాడలోన ఏవన్‌ సమావేశ మందిరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ను నిర్ణయించనున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తదితర అంశాలను ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష తో పాటు, ఎన్నికల అనంతరం టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై జరుగుతున్న దాడులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక వైసీపీ దాడులను ఏవిధంగా ఎదుర్కోవాలన్న అంశంపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. అలాగే ఆర్టికల్‌ 370 రద్దు- కాశ్మీర్‌ సమస్య తదితర అంశాలను ఈ సమావేశంలో అజెండాగా పెట్టారు.

ఏది ఏమైనా గత ఎన్నికల ఓటమితో కుదేలైన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా, పార్టీ కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *