అన్నా క్యాంటీన్ ల మూసివేతపై టీడీపీ ఆందోళన

TDP Worried About Anna Canteens Closure

ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి ఐదు రూపాయలకే భోజన వసతి  కల్పిస్తూ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను వైసీపీ ప్రభుత్వం మూసివేసింది.  దీంతో నిరుపేదల  ఆకలి తీర్చే అన్న కాంటీన్ లను మూసివేయడం తగదని,  వెంటనే వాటిని కొనసాగేలా చర్యలు తీసుకోవాలని టిడిపి ఆందోళన బాట పట్టింది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది.  ఇక అన్న కాంటీన్ ల  విషయంలోనూ  అవినీతికి పాల్పడిందని వైసిపి ఆరోపణలు గుప్పించింది.

అన్న క్యాంటీన్ అను మూసివేసి ఆ స్థానంలో రాజన్న క్యాంటీన్ లను నిర్వహించాలనే ఆలోచనలో  సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.  ఇక ఆ తర్వాత పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నా క్యాంటీన్ల స్థానంలో అవసరమైతే సంచార  క్యాంటీన్ లను నిర్వహిస్తామని  పేర్కొన్నారు.  ఇక వైసీపీ కీలక నేత విజయ్ సాయి రెడ్డి ఎన్నికల ముందు ప్రజల్ని ప్రలోభపెట్టేందుకే చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని ఆరోపణలు గుప్పించారు. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.150 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. టీడీపీ అవినీతి చివరకు పేదలకు భోజనం పెట్టే పథకంలో కూడా సాగిందని   ఆరోపించిన ఆయన పేదవాళ్లకు అతి తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి . రూ.2 లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయిందంటూ లెక్కలు చూపారని విజయసాయి విమర్శల వర్షం కురిపించారు .  టిడిపి నేతలు  ప్రతిదానిలోనూ కావాలనే వైసిపి అవినీతి ఆరోపణలు చేస్తుందని పేదవాళ్ల  ఆకలి బాధలు తీర్చే  అన్న క్యాంటీన్ విషయంలో ఇది తగదని సమాధానం చెప్పారు.

తాజాగా జరిగిన  టిడిపి రాష్ట్ర  విస్తృత స్థాయి సమావేశంలో  అన్న కాంటీన్ మూసివేత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టిడిపి నాయకులు. అన్న క్యాంటీ న్ల మూసివేత నిర్ణయానికి నిరసనగా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్ల ముందు నిరసన చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ధర్నాలతో పాటు పేదలకు అల్పాహార పంపిణీ   చేపట్టాలని, దీక్షలు, ప్రదర్శనలు వంటివి  చెయ్యాలని పార్టీ విస్తృత స్థాయి   సమావేశంలో నిశ్చయించారు.

tdp latest news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *