చెత్త వేయండి.. టీ తాగండి..

TEA ATM IN KUMBHMELA

కుంభమేళాకు వెళ్తున్నారా? అక్కడ వేడి వేడి టీ తాగాలనిపిస్తే డబ్బులు పెట్టి కొనుక్కోనక్కర్లేదు. మీ దగ్గర ఉన్న చెత్త వేస్తే చాలు.. అక్కడున్న ఏటీఎం నుంచి వేడి వేడి టీ వచ్చేస్తుంది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా ప్రయోగాత్మకంగా  ఒక టీ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీని విశేషమేమింటే.. చెత్త లేదా పనికిరాని బాటిళ్లను ఈ మెషీన్‌లో వేస్తే.. వేడి వేడి టీ  వస్తుంది. అత్యంత  ప్రతిష్టాత్మకంగా భావించే ఈ  కుంభమేళాకు  కోట్లాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలోనగర పరిశుభ్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు అధికారులు ఈ ఐడియా వేశారు. ఉచితంగా టీ వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? అందుకే తము వాడి పాడేసే వస్తువులను ఎక్కడ పడితే అక్కడే పడేయకుండా ఈ మెషీన్ లో వేస్తారు. దీంతో అటు పర్యావరణ, పరిశుభ్రత.. ఇటు భక్తులకు వేడి వేడి ఛాయ్. ఇన్ ఫ్రారెడ్ సెన్సర్ ద్వారా పనిచేసే ఈ మెషీన్ ను కుంభమేళాలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కాగా, ప్రయాగరాజ్ లో మార్చి 4 వరకు జరిగే కుంభమేళాలో సుమారు 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *