ధావన్ ఇన్.. పాండ్యా ఔట్

Spread the love

TEAM INDIA FOR WI TOUR

  • విండీస్ టూర్ కి టీమిండియా జట్టు ఎంపిక
  • ధోనీ స్థానంలో పంత్ కు ఛాన్స్
  • మూడు ఫార్మాట్లకూ కోహ్లీకే కెప్టెన్సీ

గాయం కారణంగా ప్రపంచకప్ మ్యాచ్ లకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కు మళ్లీ జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్ టూర్ కు ధావన్ ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3 నుంచి కరేబియన్ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడబోయే జట్టును బీసీసీ ఆదివారం ప్రకటించింది. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆ మేరకు విండీస్ కు వెళ్లే జట్టు వివరాలను ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న ధావన్‌ను టీ20లు, వన్డేలకు ఎంపిక చేయగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను అన్ని ఫార్మాట్లకూ దూరం పెట్టారు. ఇద్దరి కెప్టెన్ల ప్రతిపాదన వచ్చినప్పటికీ.. మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లినే ప్రకటించారు. టీ20లు, వన్డేలకు రోహిత్‌ శర్మ, టెస్టు మ్యాచ్ లకు అజింక్యా రహానే వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక నాలుగో స్థానంపై దృష్టి పెట్టిన సెలక్టర్లు.. యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండేలకు జట్టులో స్థానం కల్పించారు. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని సెలవుతో రిషబ్‌ పంత్‌ ఆ స్థానాన్ని దక్కించుకోగా.. టెస్టులకు ప్రత్యామ్నాయ కీపర్ గా సాహాను ఎంపిక చేశారు. స్పిన్నర్లలో చహల్‌ను టీ20, టెస్టులకు దూరం పెట్టగా.. కుల్దీప్‌ను టీ20లకు ఎంపిక చేయలేదు. యార్కర్ల కింగ్‌ బుమ్రాను టెస్టులకు మాత్రమే ఎంపిక చేశారు.

విండీస్ టూర్ కు ఎంపికైంది వీరే..
టీ20 జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌,  శ్రేయస్‌అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్ పంత్‌ (వికెట్‌కీపర్‌), కృనాల్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ.

 

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), రవీంద్రజడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, నవదీప్‌ సైనీ.

 

టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానే(వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌శర్మ, రిషభ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *