రెండో రోజు తెలంగాణ జట్ల గెలుపు

Telangana Basket Ball Teams Won Second Day

కటక్ లో జరుగుతున్న 46వ జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో రెండో రోజున తెలంగాణ జట్లు ఘనవిజయం సాధించాయి. తొలుత బాలికల జట్టు ప్రత్యర్థి చంఢీఘడ్ జట్టును 56-41 తేడాతో ఓడించింది. తెలంగాణ టీం తరఫున రాగమయి (15), నీలా (13), అర్పిత (10), తనూజ (8) రాణించారు.  గతేడాది జరిగిన పోటీలోనూ తెలంగాణ బాలికల జట్టు చంఢీఘడ్ పై విజయం సాధించడం విశేషం. తెలంగాణ బాలురు జట్టు వరుసుగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మణిపూర్ పై 46-38 తేడాతో తెలంగాణ జట్టు నెగ్గింది.

46th National BasketBall SubJunior Championship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *