కాంగ్రెస్ కు ఓటమి భయం

11

Telangana congress fear for by elections

ఏమి చేశాడని జానారెడ్డి ఓట్లు అడుగుతున్నారు.

# ప్రజలు నిలదిస్తారనే భయంతోటే ప్రచారానికి వెన్ను చూపుతున్నారు.

# కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది

# నోముల భగత్ విజయం ఖాయం

# నాలుగు దశాబ్దాలుగా నాగార్జునసాగర్ గోస పడింది

# 2014 తరువాతే ఇక్కడి ప్రజలకు అభివృద్ధి అంటే అర్థం అయింది

# అందుకు ఫలితమే 2018 ఎన్నికల ఫలితం

# చెప్పడానికి జానారెడ్డి దగ్గర ఏమీలేదు

# మొదటి మేజర్ కు నీళ్లు ఇవ్వలేని చరిత్ర ఆయనది

# రాజవరం మొదటి మేజర్ కు నీళ్లు ఇచ్చాకే ప్రజాలకు నిజం తెలిసింది

# తోక చివరి భూముల పేరుతో పొలాలను బీళ్లుగా మార్చారు

# ఆ ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దే

# ప్రజల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు

#ఎన్నికల వాగ్దానాలు అమలు పరచిన ఏకైక పార్టీ టి ఆర్ యస్

#ఏమి చేశారని జానారెడ్డి ఓట్లు అడుగుతున్నారు

#ప్రజలు నిలదిస్తారనే యింట్లో ఉండి ప్రచారం అంటున్నారు

#చేసేదే చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ నైజం

#తెలంగాణ లో స్వరాష్ట్రం లో సుపరిపాలన

#24 గంటల ఉచిత విద్యుత్ నుండి ప్రతి సంక్షేమ పధకం పారదర్శకమే

సాగర్ ఉపఎన్నికల ప్రచార సభలలో మంత్రి జగదీష్ రెడ్డి

ఓట్లు అడిగే హక్కు ఒక్క టి ఆర్ యస్ పార్టీకీ మాత్రమే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు.ఏమి చేశాడని జానారెడ్డి ఓట్లు అడుగుతున్నారని ఆయన నిల దీశారు.ప్రజలు నిలదిస్తారనే భయం తోటే ప్రచారానికి వెన్ను చూపుతున్నారని ఆయన ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పార్టీకీ ఓటమి భయం పట్టుకుందని, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగ ఆయన బుధవారం రోజు త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం, కొణతాల పల్లి తదితరుల గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. టీ ఆర్ యస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ తో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,యం ఎల్ సి శ్రీనివాస్ రెడ్డి,
త్రిపురారం మండల ఎన్నికల ఇంచార్జీలు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య , మహబూబాబాద్ యం ఎల్ ఏ శంకర్ నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో
ఆయనమాట్లాడుతూ ఇక్కడి ప్రజల
అమాయకత్వంతో వరుసగా ఏడుసార్లు గెలిచిన జానారెడ్డి గారు కనీసంలో కనీసం సాగర్ మొదటి మేజర్ కు నీళ్లు ఇవ్వలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. అటువంటి వ్యక్తి నిజస్వరూపం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో బయటపడినందునే 2018 ఎన్నికల్లో జానారెడ్డి ని ప్రజలు తిరస్కరించి నోముల నరసింహ్మయ్య కు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు నోముల నరసింహ్మయ్య అకాల మరణం తో ఈ ఉప ఎన్నికలు వచ్చాయాన్నారు. నోముల నరసింహ్మయ్య ఐదు ఏండ్లు అధికారంలో ఉండాలని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారని.. ఆ ఆకాంక్ష అర్దాంతరంగా ఆగిపోకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నోముల భగత్ ను ఆశీర్వదించి పోటీలో నిలిపారని ఆయన చెప్పారు.ప్రజాభీష్టానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయం లో టి ఆర్ యస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.40 ఏండ్లుగా త్రాగునీరు, సాగునీరు లేక నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎడారిగా మారిందని ఆయన ఆరోపించారు.
తోక చివరి భూముల(టెల్ ఎండ్)పేరుతో ఇక్కడి భూములను ఎండపెట్టిన చరిత్ర జానారెడ్డి ది కాంగ్రెస్ పార్టీదని అటువంటి పార్టీ నుండి పోటీ చేసిన జానారెడ్డి ని 2018 ఎన్నికల్లో నే ఇక్కడి ప్రజలు తిరస్కరించారన్నారు. అటువంటి పెద్ద మనిషి ఏమి చేశారో, ఏమి చేస్తారో ఎన్నికలప్రచారం లో చెప్పాల్సి వస్తుందన్న భయం తోటే మొహం చాటేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో అధికారంలోకి టి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే సాగర్ ఎడమ కాలువ కింది భూములకు సమృద్ధిగా రెండుపంటలకు నీళ్లు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here