కాంగ్రెస్ స్ట్రీట్ ఫైట్‌కు సిద్ధ‌మా?

Spread the love

TELANGANA CONGRESS STREET FIGHT?

కాంగ్రెస్ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రంలో ఖ‌తం కానున్న‌దా? ఆ పార్టీలో ప్ర‌స్తుతం ప‌న్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. ఎంపీగా గెలిచిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని మిన‌హాయిస్తే మిగ‌తా వారిలో ఎంత‌మందిని కాంగ్రెస్ పార్టీ నిల‌బెట్టుకోగ‌లుగుతుంది? వీరు పార్టీ మార‌కుండా ఏమేర‌కు నిలువ‌రిస్తుంది అనే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. నిజానికి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఈ గ‌తి ప‌ట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల వ్య‌వ‌హార‌మే ప్ర‌ధాన కార‌ణం. అంద‌రినీ ఏక‌తాటిపై న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డమే ప్ర‌ధాన కార‌ణం. పైగా, ముందునుంచీ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లంతా ఆంధ్ర‌, రాయ‌ల‌సీమ ముఖ్య‌మంత్రుల మీదే ఎక్కువ‌గా ఆధార‌ప‌డేది. గ‌తంలో చెన్నారెడ్డి, అంజ‌య్య వంటి తెలంగాణ నేత‌లు కొంత‌కాలం అధికారాన్ని చెలాయించినా, వారి ఉనికిని నామ‌మాత్రంగానే ఉండింది. ఆత‌ర్వాత‌, వైఎస్ వ‌చ్చిన త‌ర్వాత పార్టీ మొత్తం ఆయ‌న చేతుల్లోకి వెళ్లిపోయింది.

డ‌మ్మీ నేత‌లు

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు సొంతంగా ఇమేజీ పెంచుకున్న దాఖ‌లాలు పెద్ద‌గా లేవు. ఈ నాయ‌కులంద‌రూ అధికారం వ‌స్తే ఆస్వాదించేవారే తప్ప‌.. ప్ర‌జ‌ల్లో గుణాత్మ‌క మార్పు తేవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. పైగా, గ్రూపు రాజ‌కీయాలు ఈ పార్టీని తెలంగాణ‌లో మ‌రింత బ‌ల‌హీప‌ర్చింది. ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేసినా, మ‌ళ్లీ అదే అధికార పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరారంటే.. ప్ర‌జ‌ల అభీష్టానికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లే క‌దా! అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీలో ఉండీ, అధికార పార్టీ మీద పోరాటం చేస్తే మ‌రోసారి గెలిపించేవారు. ప‌న్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతున్నార‌నే విష‌యం తెలిసిన త‌ర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం ఎంత శాతం చేశార‌నేది ఆస‌క్తిక‌రం. కొంద‌రు కాంగ్రెస్ నేత‌లే గెలిచిన వారికి టీఆర్ఎస్‌లో జంప్ చేయించినా ఆశ్చ‌ర్య‌పోనక్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ ముందున్న కింక‌ర్త‌వ్యం?

* చేతి బొమ్మ మీద గెలిచి పార్టీ ఫిరాయించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున శాంతియుతంగా నిర‌స‌న‌లు తెలియ‌జేయాలి.
* కాంగ్రెస్ నేత‌లంతా క‌లిసి స్ట్రీట్ ఫైట్ విధానంలోకి దిగాలి. అంటే, ప్ర‌తి కాంగ్రెస్ నాయ‌కుడు, కార్య‌క‌ర్త రోడ్డుమీదికొచ్చి నిర‌స‌న‌ల్ని తెలియ‌జేయాలి.
* ప్ర‌స్తుతం పార్టీని ఫిరాయించ‌నివారిని స‌న్మానం చేయాలి. క‌నీసం, వారికి పార్టీలో ఉంటే మంచి భ‌విష్య‌త్తులో ఉంటుంద‌నే భ‌రోసా క‌లిగించాలి.
* టీఆర్ఎస్ పార్టీకి ఎప్ప‌టికైనా ముప్పు అంటూ ఎదురైతే.. అది కాంగ్రెస్ నుంచే అని అధికార పార్టీకి తెలుసు. అందుకే, ఆ పార్టీని పూర్తిగా బొంద‌పెట్టే ప్ర‌య‌త్నం అధికార పార్టీ చేస్తున్న‌ద‌ని చెప్పొచ్చు.
* పార్టీకి పునాది స్థాయిలో నుంచి బ‌లోపేతం చేసే నాయ‌క‌త్వం కావాలి. ఆధునిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుని పార్టీని పూర్తి స్థాయిలో బ‌లోపేతం అవ్వాల్సిన అవ‌స‌ర‌మిదే.

telangana congress updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *