కరోనా తీవ్రత తగ్గింది

20

Telangana Corona Status
కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందంటూ మంత్రి ఈటల రాజేందర్ని పలువురు ఎమ్మెల్యేలు  అసెంబ్లీలో ఆరా తీశారు. దీంతో ఆయన అసెంబ్లీ లో తన ఛాంబర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వీ, dme రమేష్ రెడ్డి, DPH Dr శ్రీనివాస్ మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్య అసోసియేషన్ లతో ఫోన్ లో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. కానీ తీవ్రత లేదని అధికారులు వివరించారు.

చికిత్స కి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి కోరారు. తదనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here