తెలంగాణాలో సీపీఐ డబుల్ గేమ్

Telangana CPI DoubleGame

తెలంగాణ రాష్ట్రంలో సిపీఐ  డబల్ గేమ్ ఆడుతుంది.  ఒకపక్క హుజూర్ నగర్ ఎన్నికలకు  అధికార పార్టీ కి మద్దతు ప్రకటించిన సీపీఐ, మరో పక్కన  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ అధికార పార్టీ పై పోరాటానికి  సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా  మారింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలవాలని ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకెళుతున్నాయి.  హుజూర్నగర్ ఎన్నికల బరిలో ఉన్న గులాబీ పార్టీకి  సిపిఐ మద్దతు ప్రకటించి ఎన్నికల ప్రచారం లో పాల్గొంటుంది.  ఇక ఇదే సమయంలో  అధికార టీఆర్ఎస్ ఆర్టీసీ కార్మికుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా  కార్మికుల పక్షాన నిలిచి తమ సంపూర్ణ మద్దతు కార్మికులకు ప్రకటించింది సిపిఐ. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని,  వారి డిమాండ్లని నెరవేర్చాలని  చెప్తున్న సిపిఐ హుజరాబాద్ ఎన్నికలలో మద్దతుకు,  ఆర్టీసీ సమ్మెకు లింక్ లేదని చెప్పడం గమనార్హం.  అక్కడ అధికార పార్టీకి మద్దతు ఇస్తూనే,  ఇక్కడ అధికార పార్టీ కోసం పోరాటం చేస్తామనడం సీపీఐ నాయకులకే చెల్లుతుంది అని  ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సిపిఐ మద్దతు ఉపసంహరించుకోవాలని  ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఆర్టీసీ కార్మికుల విషయంలో ఒకపక్క ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నే, మరోపక్క హుజూర్ నగర్ లో అధికారపార్టీకి సిపిఐ మద్దతు ఇవ్వడాన్ని ప్రజా సంఘాలు తప్పు పడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీకి మద్దతనేది రాజకీయపరమైన నిర్ణయమని తెలిపారు చాడా వెంకటరెడ్డి. హుజూర్ నగర్ ఎన్నికల వ్యవహారాన్ని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏమాత్రం లింకు చేయకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆర్టీసీ కార్మకుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు  తెలుపు తుందని చెప్పిన చాడా వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలతో ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలో ఉందనే విషయం అర్థమవుతోందని చెప్పారు.  రాజకీయం వేరు పోరాటం వేరు అని చెప్పి  తప్పించుకునే  ప్రయత్నం చేస్తున్న సిపిఐ నాయకులు ఇప్పుడు అడకత్తెరలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హుజూర్ నగర్ లో మంచి ఓటు బ్యాంక్ గల సీపీఐ మద్ధతు ఉపసంహరించుకుంటే టీఆర్ఎస్ గెలుపు సంక్లిష్టమయ్యే అవకాశముంది. అప్పుడు ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్ కొంచెం ఏమైనా వెనక్కి తగ్గొచ్చు అనే భావన వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా డబుల్ గేమ్ ఆడుతున్న సీపీఐ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

tags : cpi, rtc strike, huzurnagar bypoll, support, protest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *