Telangana family pension scheme
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లికి చెందిన ఈ చిన్నారి పేరు లేఖిత. తల్లిదండ్రులు సునీత, రాము. రాము డీఎస్సీ 2008 ద్వారా నియమితులైన సీపీఎస్ ఉద్యోగి. ఆయన 2018 జనవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. సంపాదించే వ్యక్తి దూరమవడం, ఫ్యామిలీ పెన్షన్ సదుపాయం లేకపోవడంతో ఆ కుటుంబం రెండేండ్లుగా వేదన అనుభవిస్తున్నది. ఆర్థికంగా కుదేలైంది. ఈ ప్రభావం పాప చదువుపై పడింది. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అందిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆ కుటుంబంలో సంతోషం నింపింది. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. లేఖిత సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసింది. చీకట్లు నిండిన తమ జీవితంలో ఇదొక కొత్త వెలుగు అని రాము భార్య సునీత సంతోషం వ్యక్తంచేశారు.