శాసన మండలికి చైర్మన్ గా మీరు వన్నె తెస్తారు

Spread the love

TELANGANA FIRST TRIBAL WOMEN MINISTER

* సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తొలి గిరిజన మహిళా మంత్రిని అయ్యాను

* మంత్రిగా మొదటి సారి మీ గురించి ఈ మండలిలో మాట్లాడడం నా అదృష్టం గా భావిస్తాను.

* చైర్మన్ బాధ్యతల స్వీకారం సందర్భంగా శాసన మండలిలో గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఈ సభకు వన్నె తెస్తారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యవతి రాథోడ్ గారు అన్నారు. చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి సత్యవతి రాథోడ్ గారు నేడు శాసనమండలి లో చైర్మన్ గా సుఖేందర్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మాట్లాడుతూ
గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో టీడీపీలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో తెలంగాణలో తొలి గిరిజన మహిళగా నేను మంత్రి కావడం అదృష్టం గా భావిస్తున్నాను. మంత్రిగా మీ గురించి తొలిసారిగా మాట్లాడడం కూడా అదృష్టం అనుకుంటున్నాను.

మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారు చెప్పినట్లు తెలంగాణ పట్ల చంద్రబాబు నాయుడు వైఖరి నాడు నచ్చక మీరు పార్టీ మారినప్పుడు నల్గొండ పార్లమెంట్ స్థానంలో నాయకులంతా మీ వెంటే రావడం ఆరోజు పార్టీ నియజక వర్గ ఇంచార్జి గా నేను చూసాను. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా రెండేళ్లు మీతో కలిసి పని చేసే అవకాశం నాకు లభించింది. మీతో అప్పుడు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తో మీ నామినేషన్ ప్రక్రియలో భాగం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

ఆదర్శవంతంగా సభను నిర్వహిస్తారని, భవిష్యత్ లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి, ప్రజలకు, రైతాంగానికి మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను.

NEW MINISTER IN TELANGANA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *