తెలంగాణలో ఏప్రిల్ 7న క్లారిటీ

Telangana Get Clarity On April 7th

ఏప్రిల్ 7న క్వారంటైన్లో ఉన్నవారి గడువు పూర్తవుతుంది కాబట్టి, అప్పుడే తెలంగాణలో కరోనా పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశముందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 25 వేల 9వందల 37మంది ప్రభుత్వ సర్వేలిన్స్ లో పెట్టామన్నారు. 30వ తేదీ మార్చ్ నుంచి వరుసగా క్వారంటైన్ టైం గడుస్తుంటుందని చెప్పారు. 1899 మందికి మార్చ్ 30న క్వారంటైన్ టైం ముగుస్తుందని, ఏప్రిల్ 7వ తేదీ వరకు క్వరంటాయిన్ లో ఉన్న వారి టైం ముగుస్తుందన్నారు. కొత్తగూడెం-కరీంనగర్ లోకల్ కేసులను ప్రభుత్వం అధీనంలోనే ఉన్నారని చెప్పారు. విదేశాలు-లోకల్ కలిపి 25వేల 9వందల 37 మంది ఉన్నారని వెల్లడించారు.

ఇప్పటి వరకు కొరొనా పాజిటివ్ కేసులు 70 కేసులు నమోదయ్యాయని, ఒకరు డిశ్చార్జీ అయ్యారని, అతనితో పీఎం ఫోనులో మాట్లాడారని చెప్పారు. చికిత్సలో ఉన్న 11 మంది రిపోర్ట్లు నెగిటివ్ వచ్చాయన్నారు. 58 మందికి చికిత్స ప్రస్తుతం ఇస్తున్నామని తెలిపారు. ఫైనల్ టెస్టులో కరొనా లేకపోతే ఇంటికి పంపిస్తామన్నారు. రోగుల్లో 74 ఏళ్ల వ్యక్తి ఒక్కరికి మాత్రమే క్రిటికల్ గా ఉందని చెప్పారు.

telangana corona updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *