ప్ర‌జ‌ల‌కు ప‌రిశుభ్ర‌మైన చేప‌లు

8

Mp Talasani srinivas going to launch vechicles for mobile fish outlet

ప్రజలకు పరిశుభ్రమైన చేపలను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు మత్స్యశాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 117 సంచార చేపల విక్రయ వాహనాలు (మొబైల్ ఫిష్ ఔట్ లెట్ ) లను ఈ నెల 27 వ తేదీ న మత్స్యశాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ HMDA గ్రౌండ్ లో ( ఐ మ్యాక్స్ దియేటర్ ప్రక్కన) లబ్దిదారులకు అందజేసి ప్రారంభిస్తారు. GHMC, 29 జిల్లాలలో 150 వాహనాలను ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ముందుగా GHMC, 29 జిల్లాలకు సంబంధించి మొత్తం 117 వాహనాలను మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుంది. ఒక్కో వాహనం విలువ 10 లక్షల రూపాయలు కాగా 6 లక్షల రూపాయలను ప్రభుత్వం, NFDB లు భరిస్తుండగా, 4 లక్షల రూపాయలను లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. స్వయం సహాయక సంఘాల మహిళలను అర్హులుగా గుర్తించి ఈ వాహనాలను అందజేయడం జరుగుతుంది. ఒకవైపు చేపలు, మరో వైపు చేప వంటకాలను విక్రయించుకోనే విధంగా ఈ వాహనాలను తయారు చేయడం జరిగింది. ఈ వాహనాల వలన ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి పరిశుభ్రమైన చేపలను సరసమైన ధరలకు అందించడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు

 

 

tspolitics