తెలంగాణ ఆరోగ్య స‌మాజం

6
4 tips to control corona
4 tips to control corona

TELANGANA HEALTHY SOCIETY

ఆరోగ్య వంతమైన సమాజం ఉన్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుంది అని, హ్యూమన్ రిసోర్స్ క్వాలిటీతో ఉండాలి అని ముఖ్య మంత్రి కెసిఆర్ గారి ఆలోచన, అందుకు అనుగుణంగా అనేక గుణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల దేశంలో చాలా విషయాల్లో మనం నంబర్ వన్ గా ఉన్నామ‌ని ఈటెల రాజేంద‌ర్ అన్నారు. ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు డాక్టర్లు నర్సులు ఖాళీలు లేవు. కొరత లేదు. కరోనా సందర్భంలో ఒకరు అవసరమైతే ముగ్గురు సిబ్బందిని తీసుకున్నామ‌న్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అనుమతితో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ లో సక్రమంగా పని చేయని వారు ఉంటే వారిని తొలగించాలని కూడా అనుకుంటున్నాము, వారి స్థానం లో కొత్తవారిని నియమిస్తామ‌ని చెప్పారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు జరుగుతుందన్నారు. శిశు మరణాల రేటు లో దేశంలో దేశ సగటు కంటే తక్కువగా ఉందని గర్వంగా చెబుతున్నామ‌ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనమండలిలో సమాధానం చెప్పారు. ప్రతి ఆసుపత్రిని పూర్తిస్థాయిలో బాగు చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

 

tspolitcs