భూసర్వే కమిటీ ఏర్పాటు

9

TelanganaLandSurveyCommittee

రాష్ట్రంలో సమగ్ర భూసర్వే కోసం ప్రభుత్వం వివిధ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసింది. సర్వే ప్రక్రియతో సంబంధం ఉండే శాఖలు, విభాగాలను కమిటీలో భాగస్వామ్యులను చేసింది. భూకొలతలు, భూదస్త్రాల నిర్వహణ, ఐటీ, సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూశాఖ, సాంకేతిక శాఖలతోపాటు పలు విభాగాల బాధ్యులను దీంట్లో సభ్యులుగా నియమించింది. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులకు అనువైన సర్వే ప్రక్రియ, టెండర్ల విధివిధానాలను కమిటీ నిర్ణయించనుంది. ప్రభుత్వం సర్వేకు రూ. 400 కోట్లు కేటాయించడంతో టెండర్లకు రంగం సిద్ధమవుతోంది.

టెండరు పేపర్స్ ను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టారు. మార్గదర్శకాలు వెలువడగానే వచ్చేనెల మొదటివారంలో టెండర్లు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. సర్వేకు అనుకూల వాతావరణం ఉండే ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో ప్రాథమిక ప్రక్రియ పూర్తిచేయాలనేది లక్ష్యం. ముందుగా అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులు, గ్రామాల సరిహద్దులను గుర్తిస్తారు. ఇవి పూర్తయ్యాక పట్టా భూముల సర్వే చేపెట్టనున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here