ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేదెవరు?

13
Telangana Mlc Elections

Telangana Mlc Elections

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చ్ 14 వ తేదీన ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎల్బీ స్టేడియం లోని ఇండోర్ స్టేడియం లో పోలింగ్ సామాగ్రిని పంపిణి చేస్తారు. ఈనెల 17 వ తేదీన ఎల్.బీ.నగర్ – సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మార్చ్ 22 వ తేదీన ఎన్నికల పూర్తి ప్రక్రియ పూర్తవుతుంది. ఎమ్మెల్సీఎన్నికల నిర్వహణా ఏర్పాట్ల వివరాలు.

*14 న ఉదయం 8 గంటలనుండి సా. 4 గంటలవరకు పోలింగ్ జరుగుతుంది.
*17 న ఎల్.బి నగర్ ఇండోర్ స్టేడియం లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

*మొత్తం తొమ్మిది జిల్లాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, రంగారెడ్డి, వికారా బాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటింగ్ ల్లో పాల్గొంటారు. మొత్తం ఓటర్లు 5,31,268 ఓటర్లు ఉండగా వీరిలో 336256 మంది పురుషులు, 194944 మంది స్రీలు ఉన్నారు. 68 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్ మల్కాజి గిరిలో 131284 మంది ఓటర్లు ఉండగా అతి తక్కువగా నారాయణ పేట్ జిల్లాలో 13899 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం నియోజక వర్గంలోని ఓటర్లలో మహబూబ్ నగర్ జిల్లాలో 35510 మంది ఓటర్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 33924 , వన పర్తి జిల్లాలో 21158 , జోగులాంబ గద్వాల్ లో 14876 , నారాయణ్ పేట్ లో 13899 , రంగారెడ్డి జిల్లాలో 144416 , వికారాబాద్ లో 25958, మేడ్చల్ మల్కాజిగిరి లో 131284 హైదరాబాద్ జిల్లాలో 110243 మంది ఓటర్లు ఉన్నారు.. మొత్తం నియోజక వర్గంలో 799 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో మహబూబ్ నగర్ జిల్లాలో 56 , నాగర్ కర్నూల్ జిల్లాలో 44 , వనపర్తి జిల్లాలో 31 , జోగులాంబ గద్వాల్ లో 22 , నారాయణ్ పెట్ లో 20 , రంగారెడ్డి జిల్లాలో 199 , వికారాబాద్ లో 38 , మేడ్చల్ మల్కాజిగిరి లో 198 హైదరాబాద్ జిల్లాలో 191 ఉన్నాయి.

*ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ సాఫీగా జరగడానికి గాను ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో ఒక ఫ్లయ్యింగ్ స్క్వాడ్ , స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 3835 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటారు. వీరిలో 959 మంది పి.ఓ లు, .ఓ.పి.ఓ 2876 మంది ఉన్నారు. ఎన్నికల బరిలో అధికంగా 93 మంది ఉండడం తో జంబో బాలెట్ పేపర్ తో పాటు జంబో బాలెట్ బాక్స్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలీన్గ్ కేంద్రానికి రెండు బాల్టీ బాక్సుల చొప్పున 1598 బాలట్ బాక్సులు అదనంగా 324 బాక్సులను సిద్ధం గా ఉంచారు. ఈ జంబో బాలెట్ బాక్సులలో పోలింగ్ కేంద్రాలకు అదనంగా 20 శాతంతో కలిపి మహబూబ్ నగర్ జిల్లాకు 269 బాక్సులను, నాగర్ కర్నూల్ జిల్లాకు 212 , వనపర్తి జిల్లాకు 149 , జోగులాంబ గద్వాల్ కు 106 , నారాయణ్ పెట్కు 96 , రంగారెడ్డి జిల్లాకు 956 , వికారాబాద్ కు 183 , మేడ్చల్ మల్కాజిగిరి కి 951 , హైదరాబాద్ జిల్లాకు 917 కేటాయించారు. 80 ఏళ్ల వృద్దులకు, కరోనా పాజిటివ్ ఓటర్లకు వారి ఇంటి వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి పోస్టల్ బ్యాలెట్ తో ఓటును వేయించారు.

 

Telangana Mlc Elections 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here