తెలంగాణలో కొత్త కేసులు 56

146
India Latest Corona updates
India Latest Corona updates

Telangana New Cases 56

తెలంగాణలో కొత్తగా 56 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారమే సూర్యాపేటలో అత్యధికంగా ఇరవై ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ఒక్క రోజే నమోదైన కేసులు పంతొమ్మిది కావడం గమనార్హం. నిజామాబాద్లో 3, గద్వాల్ 2, ఆదిలాబాద్ 2 కేసులు నమోదు కాగా.. ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. మొత్తానికి, మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసులు 928కి చేరడం గమనార్హం. ప్రస్తుతం 711 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం 194 మంది డిశ్చార్జీ అవ్వగా, 23 మంది మరణించారు. మంగళవారం ఒక్క రోజే సుమారు ఎనిమిది మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు.

Telangana Corona Cases Update

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here