వావ్‌.. విద్యుత్ సంస్థ‌లు!

21

Telangana new record in electrical consumption

13688 మెగా వాట్స్ పిక్ డిమాండ్ ను తెలంగాణ విద్యుత్ సంస్థ‌లు అధిగ‌మించాయి. వాస్త‌వానికి, ఇదే
ఇదే తెలంగాణ రాష్ట్రం లో అత్యధిక డిమాండ్ అని ట్రాన్స్ జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు. ఇంత డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేశామ‌న్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో 13 168 మెగా వాట్స్ డిమాండ్ వచ్చింది కానీ ఈ సంవత్సరం అంతకంటే డిమాండ్ పెరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 5000 మెగా వాట్స్ వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా చేస్తున్నామ‌ని తెలిపారు. ఇంత డిమాండ్ వచ్చిన అన్ని రకాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి ముందు చూపు తో విద్యుత్ ఉద్యోగుల పని తనం తో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామ‌ని వివ‌రించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఇంతటి విద్యుత్ డిమాండ్ ఉన్న వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామ‌ని.. దేశంలో నే అత్యధికంగా వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్ప‌ష్టం చేశారు. విద్యుత్ డిమాండ్ పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామ‌ని అన్నారు.

జీహెచ్ఎంసీలో 1700 మెగావాట్స్
గత సంవత్సరం తో పోల్చుకుంటే ఒక్క జిహెచ్ఎంసి లోనే 1700 మెగా వాట్స్ ఉండే ఇవాళ 2760 మెగా వాట్స్ డిమాండ్ పెరిగిందని టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు. 3000 మెగా వాట్స్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది దానికి మేము సిద్ధంగా ఉన్నామ‌ని.. వ్యవసాయ రంగం కు ఈ సంవత్సరం చాలా విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో వ్యవసాయ రంగం కు విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తో వ్యవసాయ రంగం కు విద్యుత్ డిమాండ్ పెరిగిందని.. అమెజాన్ డేటా సెంటర్ లకు కూడా మూడు సెంటర్ లకు కలిపి 30 మెగా వాట్స్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఐటీ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని.. టీఎస్ ఐపాస్ తో హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు నెలకొల్పుతున్నారు దీనితో విద్యుత్ వినియోగం పెరుగుతుంది రానున్న మరింత విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచ‌నా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here