తెలంగాణాలో పోలింగ్ ప్రశాంతం

Telangana Poling was peacefull

ఈసీఓ రజత్ కుమార్

తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, ఎక్కడా ఏ విధమైన సమస్యలూ లేవని రాష్ట్ర ఈసీఓ రజత్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పోలింగ్ సరళిపై మీడియాతో మాట్లాడిన ఆయన, మాక్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఆపై పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్ లోక్‌ సభ కు కూడా మాక్ పోలింగ్ ను విజయవంతంగా నిర్వహించామని, ఎక్కడా ఫిర్యాదులు రాలేదని అన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఎక్కడైనా ఈవీఎంలలో సమస్యలు ఎర్పడినట్టు ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని రజత్ కుమార్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *