అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలి

Telangana Pro Farmers State

సాగు లాభసాటిగా మారాలని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలని కొత్త విధానం తీసుకొచ్చారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోతలుండేవన్నారు.  1.40 లక్షల ఎకరాలకు 14 వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తామన్నారు. వానాకాలం పంటకు సంబంధించిన 7వేల కోట్ల రూపాయల్లో 3500కోట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ ఖాతాలో జమ చేశామని వెల్లడించారు. వానా కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుంది. అది దిగుబడి వచ్చే సమయంలో వర్షం వస్తుంది. అందుకే వేసవిలో మక్కలు వేసుకోవాలి అని చెబుతున్నామన్నారు.

* ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో 25వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు. రైతులు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని హితువు పలికారు. కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా.. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది. అందుకే పంటలు మార్చాలన్నారు. జిల్లా అవసరాలకు అనుగుణంగా ఎరువులు తెప్పించామని, రైతులు ఎరువులు తక్కువగా వినియోగించాలని హితువు పలికారు.

* రైతు బంధు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయలు కేటాయించిందని చెప్పారు. వాటిని నాలుగు నెలల్లో నిర్మాణాం పూర్తి చెయ్యాలని ఆదేశించారు.  రైతు బంధు వేదికల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. కొత్త వ్యవసాయ విధానంపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఒకరికొకరు పోటీ పడి నూతన వ్యవసాయ విధానం ముందుకు తీసుకుపోవాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో 20503 మంది రైతులకు ఒకే దఫాలో రుణ మాఫీ జరిగిందన్నారు. మిగిలిన రైతులకు దశల వారీగా మాఫీ చేస్తామన్నారు.

Telangana Agriculture Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *