తెలంగాణ సచివాలయం చరిత్ర

2

Telangana Secreteriat History

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిపాలనా కేంద్రంగా చరిత్రలో నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలతో కలుపుకుంటే మొత్తం 16 మంది ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి పరిపాలన సాగించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో ఈ సచివాలయ నిర్మాణం జరిగింది. 132 ఏళ్ల కాలంలో మొత్తం 10 బ్లాకుల నిర్మాణం జరిగింది. అతిపురాతనమైన జి బ్లాక్ (సర్వహిత) 1888 లో 6 వ నిజాం నవాబు కాలంలో నిర్మితమైంది.

 

ఇక ఎ బ్లాక్ భవన సముదాయాన్ని 1981 లో అప్పటి ముఖ్యమంత్రి టీ. అంజయ్య ప్రారంభించారు. C బ్లాక్ ను 1978 లో ఆనాటి సీఎం చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రగతి భవన్ను నిర్మించి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. A బ్లాక్ ఫేజ్ 2 ను 1998 ఆగస్టు 10 వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. మరోవైపు D బ్లాక్కు కూడా 2003 లో చంద్రబాబునాయుడే శంకుస్థాపన చేయగా, 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని ప్రారంభించారు. మొన్నటి వరకు ఏపీ అధీనంలో ఉన్న J, L బ్లాక్ లను అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 1990 నవంబర్ 12 న ప్రారంభిచారు. J బ్లాక్ సచివాలయంలో అతిపెద్ద బ్లాక్ అన్న విషయం తెలిసిందే.

ఆధునిక హంగులతో సమీకృత సచివాలయం

ఐతే ప్రస్తుత సచివాలయ భవనాల్ని కూల్చేసి, దానిస్థానంలోనే ఆధునిక హంగులతో కొత్త సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారు. రూ. 500 కోట్ల వ్యయంతో సమీకృత సచివాలయం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం అధునాతన హాల్స్ ను ఇక్కడ నిర్మించనున్నారు. మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేయబోతున్నారు.

Telangana Secreteriat Facts