యాట మాంసానికే సై

Telangana Sheep Farming

దేశంలో గొర్రెల సంపదలో తెలంగాణా మొదటి స్థానం సంపాదించింది. తెలంగాణలో మొత్తం 7,61,895  మంది సభ్యులు (8109) ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘంలో సభ్యులుగా నమోదయ్యారు.  సుమారు 6 నుండి 7 లక్షల కుటుంబాలు  గొర్రెలు మరియు మేకల పెంపకముపై ఆధారపడ్డారు. 20వ పశుగణన లెక్కల ప్రకారము రాష్ట్రములో మొత్తము గొర్రెలు  మరియు మేకల సంఖ్య 240.48 లక్షలు (గొర్రెల సంఖ్య 191.00 లక్షలు, మేకల సంఖ్య 49.48 లక్షలు). గొర్రెల సంఖ్యలో తెలంగాణా రాష్ట్రం దేశంలో మొదటి స్థానములో వున్నది. గొర్రె ల పెంపకములో గొల్ల, కుర్మ మరియు యాదవ కులస్థులకు ఉన్నఅపార అనుభవము మరియు నైపుణ్యమును ఉపయోగించుకొని మాంసం  ఉత్పత్తి లో స్వయం సమృద్ధి సాధించుటకు మరియు ఇతర రాష్ట్ర మరియు దేశాలకు మాంసం ఎగుమతి చేసే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్య మంత్రి బృహత్తరమైన గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారు.

* ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.66 లక్షల లబ్దిదారులకు రూ. 4579.67 కోట్ల (ప్రభుత్వ వాటా రూ.3434.75  కోట్లు మరియు లబ్దిదారుని వాటా రూ.1144.92 కోట్లు) ఖర్చు చేసి 76.94 లక్షల గొర్రెలను పొరుగు రాష్ట్రాల రైతులనుండి కొనుగోలు చేసి సరఫరా చేశారు. పంపిణీ చేసిన గొర్రెల ద్వారా 108.37 లక్షల పిల్లలు పుట్టడం జరిగినది (అంచనా). దీని ద్వారా గ్రామాలలో  రూ. 4877.01 కోట్ల సంపద సృష్టించబడినది. వీటిద్వారా 75865.82 మెట్రిక్ టన్నుల మాంసవుత్పత్తి అంచనా వేయబడింది. 2019 లో జరిగిన 20వ జాతీయ పశుగణ లెక్కల ప్రకారము మన రాష్ట్రం గొర్రెల సంఖ్యలో (190.63 లక్షలు)  దేశంలోనే మొదటిస్థానంలో వున్నది. ఇది 2012 లో జరిగిన 19వ జాతీయ పశుగణ లెక్కల తో పోలిస్తే (గొర్రెల సంఖ్య 128.35 లక్షలు) 48.52 శాతం ఎక్కువ.

భారత ప్రభుత్వం వివరాల ప్రకారం  వధిచబడే గొర్రెల సంఖ్య 2017-18 లో 120.30 లక్షలు కాగా 2019-20 నాటికి 208.00 లక్షలుగా నమోదుచేయబడినది. అనగా 57.8 శాతం ఎక్కువ నమోదుచేయబడినది. ఇది గొర్రెల పథకము అమలు ద్వారా సాధ్య పడినది. పధక అమలుకు ముందు మరియు తరువాత మాంస ఉత్పత్తిలో గణనీయమైన మార్పు వచ్చింది. 2015-16లో గొర్రె  మాంస ఉత్పత్తి 1.35 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2019-20లో గొర్రె మాంస ఉత్పత్తి 2.77 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడినది. 2015-16 తో పోల్చితే  యాటమాంస ఉత్పత్తిలో 105% పెరుగుదల రావడమైనది. యాట మాంసం యొక్క వినియోగం బాగా పెరిగినది. జాతీయ సగటు మాంస వినియోగము (అన్ని మాంసాలు కలిపి)  5.4 కేజీలు కాగా తెలంగాణలో సగటు మాంస వినియోగము 9.2 కేజీలు. దీనిలో యాట మాంసం వాటా 4 కేజీలు.

Telangana Sheep Distribution

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *