బీఎస్ఎన్ఎల్ మూసివేతపై టెలికాం మంత్రి క్లారిటీ

Telecom Minister Clarity on BSNL

బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని తెలుస్తుంది. దీంతో ప్రైవేట్ టెలికం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తూ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ను మూసివేసేందుకు సిద్ధపడుతోందని ఆరోపణలున్నాయి. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. బీఎస్ఎన్ఎల్ లేదా ఎంటీఎన్ఎల్‌ను మూసివేయ‌డం లేదని స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్ సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన ఆయన.. బీఎస్ఎన్ఎల్‌లో ప్రభుత్వం పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించ‌డం లేదని.. థర్డ్ పార్టీకి కూడా ఆ సంస్థల‌ను అప్పగించ‌డం లేద‌ని వెల్లడించారు. అయితే ఈ రెండు సంస్థల‌ను విలీనం చేసే ప్రణాళిక‌కు ఆమోదం తెలిపిన‌ట్లు రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బీఎస్‌ఎన్ఎల్ ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
tags : reliance jio, bsnl, bsnl loss, 4g spectrum, trai, telecom regulatory authority, telecom minister, ravi shankar prasad

జియో పై ఉండే శ్రద్ధ బిఎస్ఎన్ఎల్ పై ప్రభుత్వానికి లేదు ఎందుకు ?

ప్రీ పెయిడ్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్లు అందిస్తున్న జియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *