Telengana student attempt to the sucide
‘కేసీఆర్ సారూ.. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు కరువయ్యాయి. ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలియదు.. ఇన్‌టైంలో నోటిఫికేషన్లు వేయండి సారూ. చదివీ చదివీ.. మైండంతా పోతోంది సారూ.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆత్మహత్యాయత్నం చేస్తున్నాను’ అంటూ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో గ్రూప్-2 కోచింగ్ తీసుకొని ఏడాదిగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుడు, ఇక నోటిఫికేషన్ రాదేమోనన్న బెంగతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సంపత్. ఓయూలో పీజీ పూర్తిచేసి గ్రూప్-2 కోసం చదువుతున్నాడు. తండ్రి సత్యనారాయణ టైలర్‌గా పనిచేస్తూ, వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లో కోచింగ్ ఇప్పించాడు. ఏడాది కాలంగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడకపోవడంతో సంపత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం పురుగులమందు తాగాడు. ఆపస్మారకస్థితిలో పడి ఉన్న ఆయన్ను తల్లిదండ్రులు గుర్తించి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.