టెన్షన్ పడకండి .. విజయం సాధించేది టీడీపీనే

Spread the love
Tension does not fall .. TDP is successful

ఏపీలో ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పటంతో టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మనమే గెలుస్తున్నాం అంటూ పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ పార్టీనే గెలుస్తుంది..110 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు..18 నుంచి 20 ఎంపీ స్థానాలను గెలుస్తున్నాం.. మైండ్‌ గేమ్స్‌తో గందరగోళం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తారు.. ఎవరినీ నమ్మొద్దు అని కార్యకర్తలు, నేతలు, అభిమానులు, ఏపీ ప్రజలకు దైర్యం చెప్పారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు . పోటీ చేసిన అభ్యర్థులకు పార్టీ గెలుపు ఖాయమని భరోసా ఇచ్చారు .
కౌంటింగ్ ప్రక్రియలో అందరూ అప్రమత్తంగా ఉండండి.. బీ అలర్ట్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని మెజార్టీ సంస్థలు వెల్లడించాయి. దీనిపై 2019, మే 20వ తేదీ సోమవారం టీడీపీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను CEC వివాదం చేసిందని..బీజేపీయేతర పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత వీవీ ప్యాట్‌లు లెక్కించాలనే డిమాండ్‌తో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడీ అందర్నీ బ్లాక్ మెయిల్ చేస్తూ.. భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఎవరూ ఆందోళన పడవద్దని సూచించారు .మరోవైపు మే 22వ తేదీన కౌంటింగ్ ప్రక్రియపై మరోసారి శిక్షణ నిర్వహిస్తామన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. మోడీ అన్ని వ్యవస్థలను బ్లాక్ మెయిల్ చేస్తూ.. తన దారిన తెచ్చుకుంటున్నారంటూ విమర్శలు చేశారు బాబు. మోడీ అధికారంలోకి రావటం ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదమన్నారు. ఏపీలో కచ్చితంగా విజయం సాధిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు . మరి బాబు ధీమా కరెక్టు అవుతుందా ? లేదా ? అనేది తెలియాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *