TENSION IN ANDHRA DUE TO CORONA
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి సంబంధించిన కరోనా పాజిటివ్ కేసులు 1775 కాగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 34 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 27235 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు కాగా.. గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 17 మంది మృతి చెందారు. కోవిడ్ తో కర్నూల్ లో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, అనంతపురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు మృతి చెందగా.. ఇప్పటి వరకు 309 మంది కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. గడచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుండి 1168 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 20590 శాంపిల్స్ పరీక్ష చేయగా.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 11,36,225 శాంపిల్స్ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా తో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 12533 కాగా.. ఇప్పటివరకు 14393 మంది కరోనా నుంచి కోలుకోనీ డిశ్చార్జ్ అయ్యారు.