జగ్గారెడ్డి అరెస్ట్ తో ఉద్రిక్తత 

Tension with Jagga Reddy arrest

ఆర్టీసీ కార్మికుల నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రం రణరంగం తలపిస్తోంది. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకుంటుండటం.. తోపులాట జరగడం చూస్తుంటే ఆనాటి ఉద్యమ ఘట్టాల్ని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు అండగా నిలుస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అటు కరీంనగర్‌లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మరోవైపు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టెన్షన్ సిట్యువేషన్ కనిపించింది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత అదుపు తప్పినట్లైంది. పువ్వాడ అజయ్ ఇంటి ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ జీపు అద్దాలు ధ్వంసమయ్యాయి. తోపులాటలో టీజేఎస్‌ కార్యకర్త స్పృహ తప్పిపడిపోయారు.

tags : TSRTC, RTC strike , telangana RTC news , RTC JAC, jagga reddy , arrest , sangareddy

ఆర్టీసీ కార్మికులతో చర్చలకు వెళ్లాలని  హైకోర్టు ఆదేశం 

అక్రమార్కులను వదిలేసి.. అమాయకులకు ఎల్ఆర్ఎస్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *