ఈస్టర్ నాడు కొలంబోలో చర్చ్ లలో ఉగ్ర దాడులు

Terrorist attack in East Nadu colombucs

.. 24 మంది మృతి 450 మందికి గాయాలు

క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు . రాజధాని కొలంబో సహా… చాలా చోట్ల వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి . ముఖ్యంగా కొలంబోలోని మూడు ప్రధాన చర్చిలలో శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో ఎంత మంది చనిపోయిందీ ఇంకా తెలియరాలేదు . ఇప్పటికి 24 మంది మృతి చెందినట్టు 450 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది. కోచికాడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా ద్వంసం అయ్యాయి . చర్చిలోని ఫర్నిచర్ ధ్వంసమై చాలా మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గందరగోళంగా మారింది . చర్చిలో ప్రార్థనల కోసం వచ్చిన ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. వారిలో చాలా మంది చనిపోయినట్లు తెలిసింది. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు చర్చిలలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రమంలో వారిని టార్గెట్ చేసుకుని పేలుళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
మొదట కొచ్చికోడ్ ప్రాంతంలోని ప్రఖ్యాత సెయింట్ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. వీటితో పాటు శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 24 మంది ఇప్పటి వరకు మరణించగా.. 450 మందికి పైగా గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *