మోడికి ప్రజల ఉసురు తగులుతుంది

6
TRS ATTACK ON BJP
TRS ATTACK ON BJP
The public outcry against Modi

వంటగ్యాస్ తో సహా డీజిల్,పెట్రోల్ ధరల పెంచిన పాపం ఊరికే పొదని,ఆ ఉసురు మోడీ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆకాశాన్ని అంటుతున్న వంటగ్యాస్,బగ్గుమంటున్న డీజిల్,పెట్రోల్ ధరలు చూసి సామాన్యుడు బెంబేలెత్తి పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ, ఖమ్మం,వరంగల్ పట్టబద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలననే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ఫలితాలను చిట్టచివరి వరకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. అవే సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలది దుర్మార్గపు పోకడగా మారిందని ఆయన దుయ్యబట్టారు. మండలి ఎన్నికల్లో టి ఆర్ యస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మండలి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ,వరంగల్,ఖమ్మం పట్టబద్రుల శాసనమండలి ఎన్నికల్లో వరుసగా మూడో దఫా టి ఆర్ యస్ విజయకేతనం మోగించబోతుందని స్పష్టం చేశారు.ఆరు ఏండ్ల టి ఆర్ యస్ పాలనలో లక్షా 30 వేల ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన చెప్పారు. అంతే గాకుండా 14 వేల 800 ప్రవైట్ పరిశ్రమలను నెలకొల్పి 14 లక్షల ఉద్యోగాలు కల్పనకు ప్రభుత్వం దోహద పడిందని ఆయన వెల్లడించారు. వీటితో పాటు ఐటి రంగంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో మరో 60 వేల ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.అంతెందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలతో పాటు,దండు మొల్కాపురం లో గఇండస్ట్రీయల్ పార్క్,25 వేల మేఘావాట్ల ఉత్పత్తిని చేసే యాదాద్రి పవర్ ప్లాంట్ ల నిర్మాణాలు టి ఆర్ యస్ ప్రభుత్వ పరిపాలనకు దిక్షుచిలని ఆయన అభివర్ణించారు. ఇవన్నీ కూడా ఉపాధి ని పెంచే కేంద్రాలని ఆయన చెప్పారు. శాసనమండలి సభ్యుడిగా గడిచిన ఆరు ఏండ్లు గా ప్రజల గొంతుకనై పనిచేశానని మరోసారి అవకాశం కలిపించి ఆశీర్వదించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటర్లను అభ్యర్దించారు.

#TELANGANA MLC ELECTIONS 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here