శాసన సభలో ‘తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ’ బిల్

1
The Telangana Disaster and Public Health
The Telangana Disaster and Public Health

The Telangana Disaster and Public Health

శాసన సభలో ‘తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ బిల్ – 2020’ ను రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆయన మాట్లాడుతూ కొవిడ్, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోత విధిస్తూ ఆర్ఢినెన్స్ తెచ్చుకున్నాం. దాన్ని ఇప్పుడు చట్టంగా మార్చేందుకు సభ మందుకు తెస్తున్నాం.  ఏప్రిల్ నెలలో రాష్ట్ర సొంత  ఆదాయం 577 కోట్లు మాత్రమే రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు , ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్  చెల్లింపులు పోస్ట్ పోన్ చేశాం. రాబోయే రోజుల్లో చెల్లంచాలన్న ఉద్దేశంతో  ఈ  ఆర్డినెన్స్ తెచ్చుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం చెల్లింపులు పోస్ట్ పోన్ చేశాం. బడ్జెట్ లో పెట్టుకున్న ఐదు నెలల 75 వేల 125 కోట్లు రావాల్సి ఉంటే 49 వేల 131 కోట్లు మాత్రమే రావడం జరిగింది. స్టేట్ ఓన్ రెవెన్యూ  7 వేల 850 కోట్లు రూపాయలు కరోనా నేపధ్యంలో తగ్గింది. సభ లేకపోవడం వల్ల ఆ సమయంలో ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం.

ఎప్పటిలోగా వేతనాలు ఇచ్చేది సీఎంగారి పరిశీలనలో ఉంది.  అతి త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ బిల్లుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించిన ఎం.ఐ.ఎం, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. ఈ బిల్లుకు సభలో  ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.