అర్చకులకు శుభవార్త చెప్పిన వైసీపీ ప్రభుత్వం

The YCP government that gave good news to the priests

అర్చకులు, బ్రాహ్మణుల పట్ల టీడీపీ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. వంశపారపర్యంగా అర్చకులకు న్యాయం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పై ఆంధ్రప్రదేశ్ అర్చకుల సమైక్య హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు వారు తమ కృతఙ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణును వారు సన్మానించారు. విజయవాడ, బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సమావేశంలో వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జీవో 439 విడుదల చేయడం ద్వారా అర్చకుల చిరకాల స్వప్నాన్ని సీఎం జగన్ నెరవేర్చారని ప్రశంసించారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా మాత్రమే చంద్రబాబు చూశారని, అర్చకులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ చట్టాన్ని తీసుకు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్ హయాం తర్వాత అధికారంలో ఉన్న వాళ్లు ఆ చట్టాన్ని అమలు చేయలేదని చెప్పారు. దీనిపై  పాదయాత్ర సమయంలో జగన్ ని కలిసిన అర్చకులు తమ సమస్యను విన్నవించుకున్నారని, నాడు వారికి ఇచ్చిన హామీని నేడు జగన్ నెరవేర్చారని చెప్పారు. ఈ జీవో విడుదలైన దగ్గర నుంచి అర్చకులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం నిమిత్తం ఇస్తున్న మొత్తం రూ.5,000 నుంచి రూ.10,000 కు పెంచుతామని, అర్చకులకు, బ్రాహ్మణులకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు.
tags : ycp, ap government, priest, pandit, minister vellampalli srinivas, jagan, good news

కోలిక్కి వచ్చినా కల్కి ఆశ్రమం వ్యావహరం?

తాత్కాలిక సిబ్బందికి వినతి పత్రాలు, పూలు ఇచ్చి నిరసన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *