స్క్రూ డ్రైవరే ఆ దొంగ ఆయుధం ..

THIEF'S WEAPONS SCREWDRIVER

చోరీలు చేయడంలో ఆ దొంగది అందెవేసిన చెయ్యి.  40 ఏళ్ల అనుభవం ఉన్న సదరు దొంగకు  పోలీసులు, కేసులు, జైళ్లంటే భయం లేదు. స్క్రూ డ్రైవరే అతని ఆయుధం. ఇంటికి తాళం ఉంటే చాలు.. కన్నం వేసి క్షణాల్లో పైసల్ మాయం చేస్తాడు. అతనే 58 ఏళ్ళ వయసున్న మంత్రి శంకర్ అలియాస్ శివన్న, శివప్రసాద్
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 255కి  పైగా కేసులున్న ఈ ఘరాన దొంగ.. మరోసారి పోలీసులకు చిక్కాడు. రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న శంకర్ తో పాటు రౌడీ షీటర్ కె దినకరన్ ను కార్ఖానా పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. వీళ్ల నుంచి 100 గ్రాముల బంగారు నగలు, స్కూటీ, ఆటో, ఐరన్ రాడ్, స్క్రూ డ్రైవర్, టార్చి లైటు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్ వెల్లడించారు. మంత్రి శంకర్ పై 255 కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. ఇళ్ళలో చోరీలు చేయడంలో మంచి పట్టున్న శంకర్ రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో నమోదైన 11 కేసుల్లో మూడు సార్లు పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లాడు. చిలకలగూడకు చెందిన శంకర్ 1979 నుంచి మొత్తం 250 చోరీలు చేశాడు. ఇందులో 209 కేసుల్లో జైలు శిక్షలు అనుభవించాడు. బన్సీలాల్ పేట్ కి చెందిన రౌడీ షీటర్ కె.దినకరన్ తో కలిసి చోరీలకు స్కెచ్ వేశాడు. కిందటేడాది అరెస్టైన శంకర్ 18 నెలల పాటు చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించి పోయిన నెల 19 న బయటికి వచ్చాడు. మళ్లీ అదే బాటలో కార్ఖానా, తుకారాంగేట్, నేరేడ్ మెట్, కుషాయిగూడ పీఎస్ ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. వరుస చోరీలతో జనాల్ని హడలెత్తిస్తున్న శంకర్ కదలికలపై నార్త్ జోన్ పోలీసులు నిఘా పెట్టారు. కార్ఖానా ఇన్ స్పెక్టర్ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నేతాజీ టీం.. శంకర్ మూవ్ మెంట్స్ ఫోకస్ పెట్టింది. మరో చోరీకి స్కెచ్ వేశాడని తెలుసుకుని పక్కా ప్లాన్ తో శంకర్ తో పాటు దినకర్ ను మంగళవారం అరెస్టు చేసింది.

tags :  most wanted robber, arrest, Screw driver, manthri shankar ,

Related posts:

కరోనా ఎఫెక్ట్ ... వజ్రాల పరిశ్రమకు నష్టం
మీడియాకు పట్టిన కరోనా...
ఇంటర్నెట్‌ ఇక్కడే చీప్‌: కేంద్ర టెలికాం మంత్రి
శబరిమల పెప్పర్ స్ప్రే దాడిపై  సుప్రీం లో పిటీషన్
గుంటూరు డ్రగ్స్ తయారీ  ముఠా గుట్టు రట్టు
ప్రియాంకా రెడ్డి హత్య.. కేసీఆర్ స్పందన ఏదీ ?
మద్యం తాగించి.. మృతదేహాన్ని వదలకుండా పశువుల్లా  
ఒకే కుటుంబంలో ముగ్గురు కలెక్టర్లు
నేరస్తులను ఉరి తియ్యాలని డిమాండ్
అడవి జంతువులు తిరుగుతున్నాయి జాగ్రత్త..
ఏ సమయంలో అయినా 100కు  కాల్  చెయ్యండి
అలా చేస్తే ప్రియాంక రెడ్డి బ్రతికేదేమో...
ప్రియాంకా రెడ్డి హత్య కేటీఆర్ స్పందన...  
ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్... పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చిందిదే
అరెస్టు కాదు ఆహ్వానము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *