వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు

Spread the love

THOTA JOINS IN YSRCP

  • పార్టీలో చేరిన తోట నరసింహం దంపతులు
  • పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి, నటుడు రాజా రవీంద్ర కూడా…

ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీలో చేరగా.. తాజాగా కాకినాడకు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితోపాటు ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌ సమక్షంలో బుధవారం వారంతా పార్టీలో చేరారు. అందరికీ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, పెద్దాపురం నియోజకవర్గం నుంచి తోట నరసింహం భార్య తోట వాణి పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిత్వానికి పీవీపీ పేరును దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *