కిషన్ రెడ్డికి , మల్లారెడ్డికి బెదిరింపు కాల్స్

Spread the love

Threatening Calls For Kishan reddy and Malla Reddy

సోషల్ మీడియా వేదికగా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రాజకీయ నేతలను టార్గెట్ చేస్తున్నారు. బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్‌ రెడ్డిని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. ఇంటర్నెట్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా అజ్ఞాత వ్యక్తులు ఈ బెదిరింపులకు ప్పాడుతుండడంతో మంత్రి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎక్కడి నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయన్నదానిపై నిఘా పెట్టారు. అదే సమయంలో కిషన్‌రెడ్డి ఇంటివద్ద భద్రతా బలగాల సంఖ్యను పెంచారు. నిఘా పటిష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన కిషన్‌ రెడ్డికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన విషయం తెలిసిందే.
ఇక తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి.. సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. మంత్రి మల్లారెడ్డి గురించి ఫేస్ బుక్ లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో మంత్రి మల్లారెడ్డిని కొంతకాలంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయమై మంత్రి మల్లారెడ్డి ఓఎస్డీ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్న వ్యక్తుల కంప్యూటర్ ఐపీ అడ్రస్‌లను పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేయనున్నారు.

Latest political news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *