టీఆర్ఎస్ నాయకుడికి బెదిరింపులు

4
Thugs warns to TRS Leader
Thugs warns to TRS Leader

Thugs warns to TRS Leader

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ కు చెందిన టిఆర్ఎస్ నాయకుడిని గుర్తు తెలియని దండుగులు తుపాకీతో బెదిరించారు. టిఆర్ఎస్ నాయకుడు దేవయ్యను గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు తుపాకీతో హత్యాయత్నానికి ప్రయత్నించారు. దాంతో అలర్ట్ అయిన దేవయ్య, వాళ్ల చేతుల్లోంచి తుపాకీ లాగి పడేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెంటనే అక్కడనుంచి దుండగులు పారిపోయారు. ఇంతకీ దేవయపై ఎందుకు దాడి చేయాలనుకున్నారో కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రాణ భయంతో దేవయ్య పోలీసులను ఆశ్రయించాడు. ఈ బెదిరింపు సంఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులు విచారణ చేస్తే పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశాలున్నాయి.