ఆ మంత్రికి తప్పని టికెట్ టెన్షన్

Spread the love

Ticket Tension for That Minister… ఏం చేస్తారో సిద్దా ?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకపక్క టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అభ్యర్థుల ప్రకటన కసరత్తులు చేస్తుంటే, చంద్రబాబు నుండి స్పష్టమైన హామీ రాని సీనియర్ నేతలు సైతం పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మంత్రివర్యులకు సైతం టికెట్ల కోసం తండ్లాట తప్పటం లేదు. తాజాగా మంత్రి సిద్దా రాఘవరావుకు టికెట్ టెన్షన్ పట్టుకుంది అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మంత్రి సిద్దా రాఘవరావుకు టిక్కెట్‌ టెన్షన్‌ పట్టుకుంది. దర్శి అసెంబ్లీ స్థానానికి పట్టుబడుతున్నా అందుకు అధిష్టానం అనుమతివ్వడం లేదు. చంద్రబాబు మాత్రం ఒంగోలు ఎంపీ స్థానాన్ని సిద్దా రాఘవరావుకు కేటాయించారు. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గత నాలుగు రోజులుగా సిద్దా అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అమరావతిలో ఆందోళన చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో సిద్దా అనుచరులు బయల్దేరి వెళ్లారు. దర్శి అసెంబ్లీ టికెట్ కోసం సిద్దా రాఘవ రావు ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు ఎంపీగా పోటీ చెయ్యమని చెప్పటం సిద్దా రాఘవరావుకు సైతం ఇష్టం లేదు. దీంతో ఆయన చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *