టిక్ టాక్ వైద్యం నమ్మితే ఏమైంది?

6
TikTok Treatment 
TikTok Treatment 

TikTok Treatment

టిక్ టాక్.. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ కంటే వేగంగా డౌన్ లోడ్ అయిన యాప్. ప్రపంచ వ్యాప్తంగా అనామకుల నుంచి టాప్ సెలబ్రిటీస్ వరకూ.. అస్సలే మాత్రం చదువు రాని వారి నుంచి అందులోనే పాఠాలు చెప్పే ప్రొఫెసర్స్ వరకూ టిక్ టాక్ కోట్లమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే టిక్ టాక్ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఇవాళా రేపూ కనిపించడం లేదు. కొందరు దీనికి బానిసలు కూడా అయిపోయారు. మరికొందరు పెళ్లైన వాల్లు ఈ మోజులో పడిపోయి కాపురాలూ కూలగొట్టుకుంటున్నారు. ఇంకొందరు టిక్ టాక్ పరిచయాలతో మోసాలు చేస్తూ.. మరికొందరు ప్రేమల పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. అందుకే ఇది కూడ ఓ రకం వైరస్ లా మారింది సమాజానికి. మోసాలతో పాటు టిక్ టాక్ లో మిడిమిడి జ్ఞానం గాళ్లు కూడా హల్చల్ చేస్తున్నారు. తమకు అంతా తెలుసు అన్నట్టుగా వాళ్లు చేసే హడావిడీకి లేటెస్ట్ గా ఓ ఫ్యామిలీ అంతా హాస్పిటల్ పాలైంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కదిపేస్తుంది కదా.. కొందరు మాయగాళ్లు దీన్ని ఆసరాగా తీసుకుని మన వేదాల్లోనే దీనికి విరుగుడు ఉందని.. మరికొందరు ఆయుర్వేదంలో అంతా ఉందని చెబుతూ కొన్ని పోస్ట్ లు పెడుతున్నారు. అందులో కొన్ని రోజులుగా టిక్ టాక్ లో వస్తోన్న విషయం.. ఉమ్మెత్త ఆకులు పసరుగా తీసుకుంటే కరోనాయే కాదు.. దాని తాత లాంటి రోగాలు కూడా పోతాయని చెబుతున్నరు. ఇది నమ్మిన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం అంతా ఉమ్మెత్త ఆకుల రసం తాగి హాస్పిటల్ పాలయ్యారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణహానీ లేదు.కానీ కొన్ని రోజుల పాటు వాళ్లు హాస్పిటల్ లోనే ఉండాలని చెప్పారు. మొత్తంగా ఇలాంటి అవగాహన లేని పోస్ట్ లకు రెస్పాండ్ కావడమే తప్పంటే దాన్ని ఫాలో అయితే ప్రాణాలమీదికే తెచ్చుకోవడం మూర్ఖత్వం కాక మరేంటీ..?

TikTok Disadvantages