నీటి కొరత ఉందని విద్యార్థినుల జుట్టు కత్తిరింపు

Spread the love

TO SOLVE WATER PROBLEM STUDENT HAIR CUT

నీటి కొరత ఉందని హాస్టల్ విద్యార్థినుల జుట్టు కట్ చేసిన ఘటన తెలంగాణా రాష్ట్రంలో అందర్నీ షాక్ కు గురి చేసింది. నీటిని ఆదా చెయ్యాలని భావించిన ప్రిన్సిపాల్ చేసిన నిర్వాకం తల్లి దండ్రుల ఆగ్రహానికి కారణం అయ్యింది. మెదక్ జిల్లా కేంద్రం లోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన ఇది.

స్థానిక గిరిజన మినీ గురుకుల పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ఆవరణలోని బోరుబావి ఇంకిపోవడంతో కొన్నాళ్లుగా నీటికొరత నెలకొంది. అక్కడ ఉన్న విద్యార్థులకు నీటి కొరతతో చాలా ఇబ్బంది ఎదురైంది. దీంతో నీటికొరతను తగ్గించేందుకు హాస్టల్‌లో ఉండే బాలికల విషయంలో ప్రిన్సిపాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులందరికీ జుట్టును కత్తిరించి నీటిని ఆదా చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్‌ నిర్ణయించారు. విద్యార్థినులు వద్దని వేడుకుంటున్నా వినకుండా.. శనివారం సాయంత్రం వారందరికీ బాలురి మాదిరిగా హెయిర్ కట్ చేయించారు.
మౌలిక అవసరాలకు సరిపడా నీరు లేకుంటే వాటర్ ట్యాంకర్ లతో తప్పించుకోవడం గానీ , అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడమో చేయాల్సిన చోట ఆ పాఠశాల ప్రిన్సిపల్ అమ్మాయి లందరికీ జుట్టు కత్తిరించి, బాయ్ కట్ చేయించి అవాక్కయ్యేలా చేశారు . ఇదేంటి అని అడిగితే నీటి కొరత అని తాపీగా చెపుతోంది ప్రిన్సిపల్. అమ్మాయిలు తలస్నానం చేసేందుకు అధిక నీరు అవసరం మవుతోంది.. అందుకని స్నానాల కోసం నీటి కొరత ఉందంటూ బాలికల జుట్టు కత్తిరించారు సదర్ ఘనతవహించిన ప్రిన్సిపాల్.

180 మంది విద్యార్థినులకు వారి అవసరాలకు వినియోగించుకోవడానికి నీటిని, త్రాగు నీటిని అందించడం కష్టంగా మారిన నేపథ్యంలో ప్రిన్సిపల్ అరుణ తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బాయ్ కట్ తో కనిపిస్తున్న అమ్మాయిలను చూసి నివ్వెరపోయారు. కనీసం మాకు చెప్పకుండా మా పిల్లల చుట్టూ ఎందుకు కత్తిరించారు అని ప్రిన్సిపాల్ ను నిలదీశారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *